- శ్రీశైలానికి నల్లమలలో కన్నడ భక్తుల పాదయాత్ర
- ఎండను లెక్కచేయకుండా మల్లన్న చెంతకు వేలాదిగా తరలివస్తున్న కన్నడికులు
- అమ్మవారిని తమ ఆడపడుచుకు చీరె సరేలతో వస్తున్న కన్నడ భక్తజనం
శ్రీశైలంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి . దేవాది దేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం నుండి కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది . ..ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి ..అదుకో అంటూ... ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు మల్లన్న కన్నబ భక్తులు.
నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పలు సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురంలో మంచినీటి సౌకర్యం అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్నాయి ..
భీమకొలను మీదుగా కొండెక్కిన కన్నడిగులు పాదయాత్రగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళుతున్నారు. దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య శిబిరాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పించారు. అడవిమార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సహకారంతో ... స్వచ్చంద సేవకులతో అన్నదాన ఏర్పాటు చేశారు . కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఉగాది రోజున ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో వయస్సుతో సంబంధం లేకుండా మల్లన్న సన్నిధికి చేరుకుంటున్నారు.
దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు ... భుజాలపై నందివాహనాన్ని కాంబిపల్లకిని ఎత్తుకొని నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు మజ్జిగ, పండ్లు,అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు యువకులు కాళ్లకు కర్రలు కట్టుకొని కొండ ప్రాంతం ఎక్కి దిగుతూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు . పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న కన్నడిగుల భక్తులకు మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సింటెక్స్ ట్యాంక్ లు పైప్ లైన్స్.. సేదతీరేందుకు చలువ పందిళ్లను దేవస్థానం సిబ్బంది ఏర్పాటు చేశారని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
